రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీల ధర్నా!

25-07-2024 Thu 14:19 | Telangana
Advertisement
  • విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఏపీకి మాత్రమే అమలు చేశారని ఆవేదన
  • బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధానికి, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడి
  • తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడుతామని వ్యాఖ్య
Advertisement
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ... విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఏపీకి మాత్రమే అమలు చేసేలా బడ్జెట్‌లో హామీలు, కేటాయింపులు ఉన్నాయన్నారు.

తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు ఇస్తామని చెప్పి దాని గురించి బడ్జెట్‌లో ఏమీ మాట్లాడలేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీతో బీఆర్ఎస్ రాజీపడిందని విమర్శించారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు.

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారన్నారు. కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే నాటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ప్రధాని కుర్చీని కాపాడుకోవడానికే నితీశ్‌కు చెందిన బీహార్, చంద్రబాబుకు చెందిన ఏపీ రాష్ట్రాలకు న్యాయం చేశారని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
TelanganaCongressBJP

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more